WGL: CPI 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు హాజరయ్యేందుకు ఆదివారం AISF నాయకులు బయలుదేరినట్లు AISF జిల్లా అధ్యక్షుడు దిద్ది పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ఖమ్మం బయలుదేరినట్లు తెలిపారు.