KMM: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్థంతి సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం ఎన్టీఆర్ చరిత్ర నిలిచిపోతుందని పేర్కొన్నారు.