KMM: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. హెలిప్యాడ్, కాన్వాయ్ రూట్, వీఐపీ పార్కింగ్ స్థలాలు, బారికేడ్లు తదితర భద్రతాపరమైన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సీఎం పర్యటించే ప్రాంతాలలో చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.