AP: పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఎస్సీ నేత సాల్మన్ మృతిపై వివాదం నెలకొంది. పోలీసులపై వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పిన్నెల్లి గ్రామానికి వెళ్లకుండా వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సాల్మన్ అంత్యక్రియలు ఇవాళ జరగకపోతే రేపు జగన్ వస్తారని వెల్లడించారు. టీడీపీ నాయకులు పథకం ప్రకారమే హత్య చేశారని ఆయన ఆరోపించారు.