NLG: మండలంలోని శెట్టిపాలెంకు చెందిన రేగూరి గోవర్ధన్ గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆదివాసి ఛైర్మన్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గురువారం పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.