VZM: గరివిడి మండలం, కొండదాడి గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈమేరకు దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఆర్మీ సైనికులను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని, తన సొంత ఖర్చుతో క్రికెట్ కిట్లను అందజేశారు.