GNTR: గుంటూరు నగర అభివృద్ధిలో కమిషనర్ పులి శ్రీనివాసులు తనదైన ముద్ర వేశారని తూర్పు ఎమ్మెల్యే నసీర్, మేయర్ రవీంద్రప్ర శంసించారు .మున్సిపల్ కమిషనర్ బదిలీ అయిన నేపథ్యంలో గురువారం బృందావన్ గార్డెన్స్‌లోని క్యాపిటల్ హోటల్లో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. కమిషనర్ సమర్థత, దూరదృష్టి వల్ల నగరంలో అనేక పెండింగ్ పనులు వేగవంతం అయ్యాయని ఆయన కొనియాడారు.