GNTR: చేబ్రోలు (M) కొత్తరెడ్డిపాలెంలోని K.C.స్కూల్ శతవసంతాలు పూర్తి చేసుకోవడం హర్షనీయం అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. కొత్తరెడ్డిపాలెంలోని K.C ఎయిడెడ్ పాఠశాలలో ఆదివారం శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే శిలాఫలకం, డిజిటల్ క్లాస్ రూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్కూల్ కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.