MDCL: మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా, బాధపడుతూ తిరుగుతున్న ఓ 8 ఏళ్ల బాలికను రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు మందలించారు. అనంతరం అమ్మాయి వివరాలను తెలుసుకొని, బిడ్డను తన తండ్రి చెంతకు చేర్చినట్లుగా హైదరాబాద్ రైల్వే డివిజన్ ఉన్నతాధికారుల బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా తండ్రి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.