రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండో రోజు రూ.32.84 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చినట్లు పేర్కొన్నాయి. ఇక హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు.