KKD: సమాజంలో మత కల్లోలాలు రెచ్చగొట్టే వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఆయన శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. కావాలని అల్లర్లు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దన్నారు. నేరాల అదుపునకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు