PLD: సత్తెనపల్లి కొత్తపేటలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు శనివారం రాత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ బహుమతులు ప్రదానం చేశారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని, భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.