WGL: ఖానాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం పాకాల తూముల గేట్లను ఎత్తి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సీజన్లో రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.