HNK: లాల్ బహదూర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు కైట్ ఫెస్టివల్, రంగోలి, మెహందీ పోటీలను నిర్వహించారు. ఈ వేడుకలకు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం హాజరై పతంగులను ఎగిరేసి సందడి చేశారు. సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఎల్బీ కళాశాలలో సంబరాలు నిర్వహించడం అభినందనీయమని రిజిస్ట్రార్ అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అరుణ డీహెచ్ రావు ఉన్నారు.