ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక వై. జంక్షన్లో బుధవారం రాత్రి ఎస్సై వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ దగ్గర సరైన ధృవపత్రాలను కలిగి ఉండాలన్నారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.