TG: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కైట్ ఫెస్టివల్‌కు 19 దేశాల నుంచి 40 మంది కైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. భారత్ నుంచి 15 రాష్ట్రాల కైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నారని తెలిపారు. రాత్రి వేళల్లోనూ వెలుగులు విరజిమ్మేలా కైట్ ఫ్లై ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల కళా సంప్రదాయాల ప్రదర్శన ఉంటుందన్నారు.