VSP: పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత తన హోదాను పక్కనపెట్టి జనంలో ఒకరిగా అందరితో కలిసిపోతుంటారు. ఆదివారం రాత్రి పాయకరావుపేట పట్టణంలో ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి నడుస్తూ మధ్యలో పానీపూరీ బండి వద్ద ఆగారు. పానీ పూరిని రుచి చూసి టేస్ట్ బాగుందని కితాబునిచ్చారు. కాకపోతే చేతులకు గ్లోజ్లు ధరించి విక్రయించాలని వ్యాపారికి సూచించారు.