ATP: జిల్లాలో దానిమ్మ ధరలు పెరగడంతో సాగుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో వర్షాలతో తెగుళ్లు సోకి టన్ను ధర రూ.70 వేలకు పడిపోయింది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించి కాయలు నాణ్యంగా ఉండటంతో టన్ను ధర రూ.1.55 లక్షల వరకు పలుకుతోంది. జిల్లాలో 274 హెక్టార్లలో దానిమ్మ పంట సాగులో ఉందని అధికారులు తెలిపారు.