అంగారక గ్రహంపై నీటి గుహలను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హిబ్రుస్ వాలీస్ ప్రాంతంలో ఈ గుహలు ఉన్నాయని గుర్తించారు. నీటి వల్ల అవి ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భూమిపై కాకుండా మరో గ్రహంపై నీటి గుహలను గుర్తించడం ఇదే తొలిసారి. ఇది అంగారక గ్రహంపై జీవం ఉందనే ఆధారాలను అధ్యయనం చేయడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.