ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు.. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.