KRNL: కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం జగన్నాథగట్టులోని జిల్లా పోలీస్ ఫైరింగ్ రేంజ్లో పోలీసులు 27 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ. 10.33 లక్షల విలువైన 126 కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. మంగళవారం ఎక్సైజ్, రెవెన్యూ అధికారులతో కలిసి అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ఈ గంజాయిని ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, డీఎస్పీ, సీఐలతో పాటు అధికారులు ఉన్నారు.