ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్నాడు సుడిగాలి సుదీర్.. సుధీర్ ఏ షో చేసినా టీఆర్పీ బద్దలవాల్సిందే. అయితే స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న సుధీర్.. బిగ్ స్క్రీన్ పై కూడా దుమ్ముదులిపాడు. ఇటీవలె సుధీర్ క్రేజ్ ఏంటో నిరూపించింది ‘గాలోడు’ సినిమా. అంతకు ముందు సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటేడ్ పండుగాడ్ వంటి సినిమాలు చేసినప్పటికీ.. గాలోడు మాత్రం సుధీర్‌కు మాసివ్ హిట్ అందించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్ అందుకోవడంతో.. సుధీర్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో టాలీవుడ్ ప్రముఖులు సుధీర్‌తో సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలా అని సుధీర్ ఏ సినిమా పడితే ఆ సినిమా చేసే ఆలోచనలో లేడు. గాలోడుతో వచ్చిన క్రేజ్‌ను కాపాడుకునేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్లాలని చూస్తున్నాడు సుధీర్. ప్రస్తుతం ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ కమిట్ అవలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఓ ఫేడవుట్ డైరెక్టర్‌తో సుధీర్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో మంచు మనోజ్‌తో బిందాస్, నాగార్జునతో రగడ, విష్ణుతో దూసుకెళ్తా, సునీల్ హీరోగా ఈడు గోల్డ్ ఎహే.. అనే సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ వీరుపోట్ల.. సుధీర్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగినట్టు టాక్. అయితే 2016 తర్వాత మరో సినిమా చేయలేదు వీరుపొట్ల. కాబట్టి సుధీర్‌తో సినిమా ఉంటుందని ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేం. మరి సుధీర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.