కృష్ణా: రాష్ట్ర భూగర్భ జలవనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నేడు పెడన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.