HYD: రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ మిట్టల్ ఈనెల 29, 30న సికింద్రాబాద్ కంటోన్మెంట్ను సందర్శించనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు పనితీరును ఆయనకు వివరించేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అధికారులు సిద్ధం చేస్తున్నారు. కంటోన్మెంట్ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయనకు వివరించనున్నారు.