AP: క్రిస్మస్ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వమానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు, ప్రేమమూర్తి క్రీస్తు అని పేర్కొన్నారు. ఈ పర్వదినం మీ జీవితంలో ఆనందం సదా ఉండాలని, అందరికి యేసుప్రభువు ఆశీర్వాదం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.