NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం లాక్ టవర్ సెంటర్లోని క్యాంపు కార్యాలయం (ప్రజాభవన్)కు చేరుకున్నారు. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఆయనను ఆత్మీయంగా కలిశారు. అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలను మంత్రి ఆత్మీయంగా పలకరించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దుబ్బ సాత్వికకు నియామక పత్రం అందించారు.