WGL: DGP శివధర్ రెడ్డి ఆదేశాలతో WGL కమిషనరేట్ పోలీసుల్లో వణుకు మొదలైంది. గత కొన్ని నెలలుగా స్టేషన్లలో అక్రమ వ్యవహారాలు జరుగుతున్న నేపథ్యంలో ACPతో పాటు CI, SIలను విధుల నుంచి తొలగించిన మరుసటి రోజే DGP నుంచి కఠిన ఆదేశాలు రావడంతో కొందరు అధికారులు జాగ్రత్త పడుతున్నారు. గీత దాటితే వేటు తప్పదంటూ DGP హెచ్చరికలు జారీ చేయడంతో పోలీస్ వర్గాల్లో కలవరం నెలకొంది.