టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు అత్యంత ఇష్టమైన హీరో అని తెలిపాడు. దక్షిణాది సినిమాలను ముఖ్యంగా తెలుగు చిత్రాలను ఎక్కువగా చూస్తానని, తనకు మహేష్‌తో పాటు అల్లు అర్జున్ కూడా ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.