AP: ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీఎం చంద్రబాబును కలిశారు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ చంద్రబాబుకు వినతి పత్రం అందించారు. విజయవాడ పరిసరాల్లోని 74 గ్రామాలను విలీనం చేస్తూ గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయాలని వారు ప్రతిపాదించారు. దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నందున సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు.