ఢిల్లీలోని కెథడ్రల్ చర్చ్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చ్‌లో అక్కడివారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇది ప్రేమ, శాంతి, కరుణల కాలాతీత సందేశాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు క్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేయాలని ఆంకాంక్షిస్తూ.. X వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.