NTR: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. అర్ధరాత్రి రోడ్లపై వేడుకలు, మద్యం తాగి డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బందర్, ఏలూరు, బీఆర్టీఎస్ రహదారులపై అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల సీజ్‌తో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు.