వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో ఫుట్ బాల్ కోచ్ శ్రీ ఎండీ మొయిజుద్దీన్ విద్యార్థులకు ఫుట్ బాల్ క్రీడపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలని ఆకాంక్షించారు. క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను, ఫుట్ బాల్లోని మెలకువలను విద్యార్థులకు వివరించారు.