RBI : నూతన పేమెంట్ సిస్టమ్‌ను తీసుకొస్తున్న ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త పేమెంట్ సిస్టమ్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్ డెవలప్మెంట్ పని చేస్తున్నది
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త సిస్టం ద్వారా మరొక కొత్త అధ్యాయానికి తెర లేపనుంది. ఆర్బీఐ కొత్తగా ఒక పేమెంట్ సిస్టం (Payment system) తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫెస్ (UPI) ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చిన ఆర్బీఐ. LPSS సిస్టం అనేది మాములు UPI లాగా పేమెంట్స్ చేయకుండా ప్రకృతి విపత్తులు, దేశాల మధ్య యుద్ధాలు, భారీ వర్షాలు, వరదలు (floods) వంటి ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పేమెంట్స్ సిస్టమ్ ద్వారా చెల్లింపలు చేయనుంది. విపత్కర పరిస్థితుల్లో ఇది బాగా ఉపయోగపడుతుందని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ట్రాన్సాక్షన్స్ కోసం NEFT, RTGS, UPI వంటి పలు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వీటికి ఇంటర్నెట్ తప్పనిసరి. విపత్తుల సమయాల్లో కమ్యూనికేషన్ పనిచేయనప్పుడు వీటి ద్వారా చెల్లింపులు చేయడం కుదరదు.
కాబట్టి విపత్తులు ఎదురైనప్పుడు కూడా సులభంగా ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ వ్యవస్థను రూపొందించాలని ఆర్బీఐ (RBI) చూస్తోంది. పరిమిత సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరికరాలతో ఈ కొత్త పేమెంట్ సిస్టంను ఆర్బీఐ తయారు చేయనుంది. విపత్కర సమయాల్లో అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు దీనిని యాక్టివేట్ చేసుకునేలా ఆర్బీఐ రూపొందించనున్నట్లు సమాచారం.కొంతమంది ప్రత్యేక ఉద్యోగులు ఈ వ్యవస్థను ఎక్కడైనా ఆపరేట్ చేయవచ్చని పేర్కొంది. ఇప్పటి వరకు ఐటీపై ఆధారపడి పని చేస్తాచి. ప్రస్తుతం చెల్లింపుల కోసం అమలవుతున్న ఆర్టీజీసీ (RTGS), నెఫ్ట్ (NEFT), యూపీఐ (UPI) సేవలతో పెద్ద మొత్తంలో చెల్లింపులను చేసేందుకు ఆర్బీఐ రూపొందించింది.ఈ చెల్లింపు వ్యవస్థలు అధునాతన ఐటీ మౌలిక సదుపాయాలపై పని చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం సంభవించినప్పుడు అంతర్లీన సమాచారం, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగిన సమయాల్లో ఇవి పని చేయవు.