KNR: అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపురూపమైన జల సంపద వృథాగా పోతోంది. గతనెల 21న గుంపుల– తనుగుల గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ పాక్షికంగా కూలిపోయింది. ఘటన జరిగి దాదాపు నెల రోజులు కావస్తున్నా సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.