VZM: విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసర భయాందోళనలు రాకుండా తగిన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వ్యాధి పరిస్థితిని సమీక్షించారు.