WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కన్వీనర్ బొంపల్లి దేవేందర్ రావుకు AICC TG ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి ప్రత్యేక పిలుపు వచ్చింది. ఇటీవల జిల్లా అధ్యక్ష పదవికి తీవ్రంగా పోటీపడిన ఆయనను స్వయంగా ఫోన్ చేసి HYDకు రమ్మని సూచించారు. దీంతో బొంపల్లికి కీలక బాధ్యత రావొచ్చని వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.