E.G: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి చెందిన భక్తులు శుక్రవారం రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. గ్రామానికి చెందిన ముళ్లపూడి వెంకట సుబ్బారావు, లక్ష్మి రజని, ముళ్లపూడి శివ రామకృష్ణ, సాయి శృతి దంపతులు ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందించారు. నిత్య అన్నప్రసాద వితరణకు ఈ విరాళం అందించారు.