DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ 763 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నీషియన్-A పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు వెబ్సైట్ https://www.drdo.gov.in ను సందర్శించండి.