తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనాలకు శ్రీవాణి కోటా టికెట్లు అన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. జనవరి 2 – 8 తేదీలకు గాను రోజుకు 1000 చొప్పున 7 వేల టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. కాగా DEC 30, 31, JAN 1కి సంబంధించిన టికెట్లను ఈ-డిప్ ద్వారా కేటాయించిన సంగతి తెలిసిందే.