WNP: మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో, వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా 12వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర ఛైర్మన్, ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాష్ మాట్లాడుతూ న్యాయమైన హక్కుల కోసం పోరాడినందుకు ప్రభుత్వం మండేలాను 27 సంవత్సరాల పాటు జైల్లో నిర్బంధించిందన్నారు.