మనిషికి మనిషే తోడు. కొత్త ఏడాదిలో మరింత మెరుగ్గా మానవ సంబంధాలు ఉండేందుకు చొరవ తీసుకోవాల్సిందే. బిజీ జీవితాన్ని కాసేపు పక్కన పెట్టి ఆ సమయాన్ని కుటుంబ సభ్యులకు కేటాయించడం.. పిల్లలతో ఆడుకోవడం.. స్నేహితులతో మాట్లాడటం.. ఊళ్లలో ఉన్న పెద్దవాళ్లను పలకరించడం లాంటి చర్యలతో ఒత్తిడి తగ్గడమే కాక సానుకూలత పెరుగుతుంది. ఇప్పటినుంచే ఆ దిశగా అడుగులు వేయండి.