సూర్యాపేట జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గిపోతోందని ఎస్పీ కె. నరసింహ తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో మంచు ప్రభావంతో 77 రోడ్డు ప్రమాదాలు, 34 మంది మృతి, 94 మంది గాయపడ్డారని వెల్లడించారు. డ్రైవర్లు తప్పనిసరిగా తక్కువ వేగం, లోబీమ్ లైట్లు, ఇండికేటర్ల వినియోగం, వాహనాల మధ్య దూరం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.