MBNR: నగర కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ, వెంకటాద్రి నగర్, మార్కండేయ కాలనీలలో కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలకు భయాందోళనలు కలిగిస్తున్నాయి. పదుల సంఖ్యలో గుంపులుగా తిరిగే వీటి వల్ల చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఈ కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.