NLG: దత్తాత్రేయుడి జయంతి సందర్భంగా చింతపల్లిలోని సాయిబాబా ఆలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన గోశాలను పరిశీలించి, నిర్వహణ గురించి తెలుసుకున్నారు. అర్చకులు ముందుగా మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి సత్కరించారు. సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.