CTR: గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రంలో శుక్రవారం ఉదయం జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పర్యటించనున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో జరిగే ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమానికి ఎన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని ఎమ్మెల్యే ఓ ప్రకటనలో తెలిపారు.