AP: దుష్ప్రచారం చేయడం మాజీ సీఎం జగన్కు ఆనవాయితీగా వస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ హయాంలో ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధిలో ముందుకెళ్తుంటే విషం చిమ్మే యత్నం చేస్తున్నారని తెలిపారు. జోగి రమేష్, పిన్నెల్లి వంటి వారిని అద్భుత వ్యక్తులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.