దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) ముద్దుల కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.
Janhvi Kapoor : దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) ముద్దుల కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. జూ.ఎన్టీఆర్(Jr. NTR) సరసన `దేవర`(Devara) సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా అలరించబోతోంది. ఈ చిత్రానికి కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్టులకు కమిట్ అయిన జాన్వీ కపూర్.. తాజాగా అనుకోకుండా ట్రోలర్స్ బారిన పడింది. హోటల్ వెలుపల జాన్వీ కపూర్ పిల్లోతో కనిపించింది. దీంతో దొంగతనం చేసిందంటూ పలువురు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
పిల్లో(pillow) దొంగతనమా.. స్టార్ హీరోయిన్ అయ్యుండి ఇదేం బుద్ధి రా బాబు అనుకుంటున్నారా.. అసలేం జరిగిందంటే మే 22న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మీడియా కంట పడింది. స్కై బ్లూ అండ్ వైట్ కలర్ ప్రింటెడ్ డ్రెస్ లో అందంగా దర్శనమిచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె ఓ తెల్లటి దిండును మోస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడతంతో.. నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. హోటల్ నుంచి జాన్వీ పిల్లోను కొట్టేసిందని కొందరు ట్రోల్ చేస్తుంటే.. ఇంకొందరు జాన్వీ ఫ్లైట్ లో వెళ్తుందా లేక ట్రైన్ లో వెళ్తుందా అని ఎగతాళి చేయడం ప్రారంభించారు.