ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను మొదలు పెట్టేందుకు రెడీవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్‌కి విలన్‌గా బాలీవుడ్ హీరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముందుగా సంజయ్ దత్ పేరు వినిపించగా.. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్‌ను మహేష్‌కి విలన్‌గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్.. ఆదిపురుష్ సినిమాలో రావణ్‌గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో ఐటెం బ్యూటీ ఎవరనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఈ మధ్య హాట్ బ్యూటీ రష్మిక.. ఐటెం బ్యూటీగా ఖాయమైందనే టాక్ నడిచింది. అయితే ఇప్పుడు తమన్నా పేరు తెరపైకొచ్చింది. దాంతో అసలు మహేష్‌తో చిందేసే స్పెషల్ బ్యూటీ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. ఇకపోతే మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్టేట్ ఒకటి వైరల్‌గా మారింది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతున్న ఈ చిత్రాన్ని.. 2023 జూన్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్టు సమాచారం. రాజమౌళి తండ్రి, రచయిత విజేయంద్రప్రసాద్ ఈ విషయాన్ని కన్ఫామ్ చేసినట్టు చెబుతున్నారు. అలాగే.. చాలా రోజుల నుంచి రాజమౌళి ఇలాంటి కథ చేయాలనుకుంటున్నాడు.. కానీ ఇప్పుడు మహష్తో చేయబోతున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రదేశాల్లో ఉంటుందని చెప్పారట. ఈ నేపథ్యంలో.. టాప్ హాలీవుడ్ స్టూడియోతో టై అప్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శక ధీరుడు ఆ దిశగా చర్చలు చేస్తున్నట్టు టాక్. త్వరలోనే ఇలాంటి విషయల్లో క్లారిటీ రానుందని అంటున్నారు.