ఎరువుల ధరను పెంచడం లేదని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకుగాను ఎరువుల ధరలపై కేంద్ర మంత్రి నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ధరలు పెంచడంలేదని అధికారులు తెలిపారు. దీంతోపాటే వానాకాలం సీజన్ లో ఎరువులకు రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీ ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం చెప్పింది. ఈ వియాన్ని కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా మీడియాకు తెలిపారు. యూరియాకు 70 వేల కోట్ల రూపాయాలు, డీఏపీకి 38వేల కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గతఏడాది కూడా రూ.2.56 లక్షల కోట్లను ఖర్చును చేసిందని తెలిపారు.