NZB: మోస్రా మండల కేంద్రంలో రైతుల కల్లాల్లో తడిసిన ధాన్యం కుప్పలను తహశీల్దార్ రాజశేఖర్ గురువారం పరిశీలించారు. వర్షం నుంచి రక్షించుకోవడానికి టార్పాలిన్ పట్టాలు కప్పుకోవాలని రైతులకు సూచించారు. తడిసిన రైతుల పేర్లు, పంట సాగు వివరాలను ఐకేపీ కొనుగోలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యంపై జిల్లా కలెక్టర్కు సిఫారసు చేస్తామన్నారు.